తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Telangana PCC Chief Revanth Reddy ) చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది.మరికొద్ది నెలలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో( Telangana Assembly Elections ) కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రధాన అంశాలు వివరించారు.దళితులు, గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.
పేదలు ఇల్లు కట్టుకునేందుకు ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు.పోడు భూములకు పట్టాలు( Waste Lands ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎస్సీల కోసం మూడు కార్పోరేషన్ లు.అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి కార్పొరేషన్ కి ద్వారా 750 కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
![Telugu Chevella Sabha, Congress, Congresspraja, Revanth Reddy, Sc St, Waste-Late Telugu Chevella Sabha, Congress, Congresspraja, Revanth Reddy, Sc St, Waste-Late](https://telugustop.com/wp-content/uploads/2023/08/T-Congress-Revanth-Reddy-Announces-SC-ST-Declaration.jpg)
చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ప్రకటించిన ఎస్టీ, డిక్లరేషన్( SC,ST Declaration ) లోని ముఖ్యంశాలు చూస్తే:-
1) జనాభా ప్రకారం ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.2) ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.3) అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు 12 లక్షలు.నగదు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.4) ఇందిరమ్మ పక్క ఇండ్ల కింద ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు సహాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.5) ప్రైవేటు విద్యాసంస్థలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ లు( SC ST Reservation ) కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు.6) ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలు.7) ఎస్టీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.8) సమ్మక్క సారక్క( Sammakka Sarakka ) గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం.9) ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములకు సర్వహక్కులు.10) గిరిజన తండాలకు ప్రతి ఏడాది 15 లక్షల రూపాయలు.11) ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేస్తే పదివేల రూపాయలు, డిగ్రీ పూర్తి చేస్తే 25 వేల రూపాయలు, పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలు, పీహెచ్డీ పూర్తి చేస్తే ఐదు లక్షలు.12) ప్రతి మండలంలో ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు.13) విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం.