నేడే విడుదల :  ఫైనల్ లిస్ట్ రెఢీ చేసిన జగన్

ఎట్టకేలకు వైసిపి( ycp ) అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్( jagan ) చాలా కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.గెలుపు గుర్రాల కే టికెట్లు కేటాయిస్తున్నారు.

 Released Today Jagan Made The Final List, Jagan, Ap Cm Jagan, Ysrcp, Ap Governme-TeluguStop.com

రెండు విడతలుగా విడుదల చేసిన జాబితా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈరోజు మరో జాబితాను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు నియోజకవర్గాల వారీగా కుల సమీకరణాలు, అభ్యర్థుల బలం, ఆర్దిక పరిస్థితి, ప్రజల్లో వారికి ఉన్న గ్రాఫ్ ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుని మరీ అభ్యర్థుల ఎంపికలు జగన్ చేపడుతున్నారు.ఖచ్చితంగా 175 స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

అందుకే అన్ని మొహమాటలను పక్కనపెట్టి మరీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఇక అసెంబ్లీ స్థానాలతో పాటు, లోక్ సభ స్థానాల పైనా జగన్ దృష్టి సారించారు.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పాటు, ఎంపీ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నేతలతోనూ జగన్ చర్చలు జరిపారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mla Tickets, Mp Ticets, Ysrcp, Ysrcpconstency-Pol

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము అని , మార్పులకు కారణా లను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక కొన్ని కొన్ని నియోజకవర్గాల విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో, వాటిపైన జగన్ క్లారిటీ ఇస్తున్నారు.ముఖ్యంగా సీనియర్ నేతలు పోటీ చేయబోతున్న నియోజకవర్గాల విషయంలో సోషల్ మీడియాలో అనేక అసత్యాలు ప్రచారం అవుతుండడంతో, వాటిపైన క్లారిటీ ఇస్తున్నారు .అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ ను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి( Gopireddy Srinivas Reddy ) ఫైనల్ చేశారు.అలాగే విజయనగరం జిల్లా ఎస్ కోట విషయంలోనూ సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మంత్రి బొత్స ను కలిశారు.వారికి బొత్స సర్ది చెప్పారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( Vemireddy Prabhakar Reddy )ఇప్పటికే నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సీటును ఆయనకే ఖరారు చేసినట్లు సమాచారం.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mla Tickets, Mp Ticets, Ysrcp, Ysrcpconstency-Pol

మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వీ వీ వినాయక్ ( V V Vinayak )ను పోటీకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నారు.నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, విజయనగరం నుంచి చిన్న శ్రీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.విజయవాడ టిక్కెట్ ను బీసీ అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.ఇంకా ఎవరి పేరును ఫైనల్ చేయలేదు.విశాఖ పార్లమెంట్ బరిలో బొత్స ఝాన్సీ ,గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లకే కేటాయించబోతున్నట్లు సమాచారం.కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి నుంచి అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ ,విక్రమ్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నాయి.

బాపట్ల నుంచి నందిగామ సురేష్( Nandigama Suresh ), తిరుపతి నుంచి గురుమూర్తి ,కడప నుంచి అవినాష్ రెడ్డి ,రాజంపేట నుంచి రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జిగా శంకరనారాయణ ,హిందూపురం ఇన్చార్జిగా శాంత, అరకు ఇన్చార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే ప్రకటించారు.

ఎమ్మెల్యే ,ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ఈరోజు విడుదల చేయబోతూ ఉండడం తో టికెట్లు ఆశిస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube