వీడియో: ముంబైలో బైక్, కారు ఢీ.. తప్పెవరిదో చెప్పగలరా..

ముంబై( Mumbai )లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.బైక్‌ రైడర్‌ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకునేటప్పుడు అటువైపు నుంచి రోడ్డు మీద ఏ వాహనం వస్తుందో అసలు చూసుకోలేదు.

 Video: Bike And Car Collide In Mumbai Can You Tell Me Who Is At Fault, Viral Vi-TeluguStop.com

కొంచెం కూడా జాగ్రత్త పడకుండా, ఏవైనా వాహనాలు వస్తున్నాయా లేదా అనేది చూసుకోకుండా అతడు సడన్‌గా టర్నింగ్ తీసుకున్నాడు.ఆ సమయంలో లెఫ్ట్ సైడ్ రోడ్డుపై కారు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ సిగ్నల్ వద్ద కూడా ఆగలేదు.

దాంతో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను కారు చాలా వేగంగా ఢీ కొట్టింది.అలా ఢీకొనడంతో బైక్‌, కారు ధ్వంసమయ్యాయి.

రోడ్డుపై బైక్ జారుతూ ముందుకు వెళ్ళిపోయింది.రైడర్ కిందపడి రోడ్డుపై పల్టీలు కొట్టాడు.

బైక్ రైడర్ సిగ్నల్ పడింది కదా, ఏ వాహనాలు దానిపై నడవవని భావించాడు.అందుకే హార్డ్ టర్నింగ్ తీసుకున్నాడు.కానీ సిగ్నల్ జంప్ చేసే బ్యాడ్ డ్రైవర్స్ ఉంటారనే నిజాన్ని అతడు ఊహించలేకపోయాడు.అదే అతడు ప్రమాదానికి గురవడానికి కారణమయ్యింది.@RoadsOfMumbai ట్విట్టర్ పేజీ( Twitter ) ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

“మన దేశంలో ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) ప్రకారం ఈ యాక్సిడెంట్ లో ఎవరిపై కేసు బుక్ చేయాలి?” అని పేజీ ఓ క్యాప్షన్ అడిగారు.చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.బైక్ రైడర్ తప్పు చేశాడని, శిక్షించాలని కొందరు అన్నారు.

కొందరు కారు డ్రైవర్ తప్పు చేశారని, సిగ్నల్ జంప్ చేయడం నేరమని, శిక్షించాలని అన్నారు.పరిస్థితిని చూసి కొందరు జోకులు వేశారు.

ముంబై పోలీసులు వీడియోను చూసి రియాక్ట్ అయ్యారు.యాక్షన్ తీసుకోవడానికి సంఘటన జరిగిన కచ్చితమైన స్థలం ఏంటో చెప్పాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube