గ్లోబల్ స్టార్ చరణ్( Ram charan ) ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్నాడు.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమాలో నటిస్తున్నాడు.
ఉప్పెనతో బుచ్చి బాబు ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా మరోసారి అదె రేంజ్ సినిమా చేయాలని చూస్తున్నారు.ఈ క్రమంలో చరణ్ తో మరో పీరియాడికల్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆర్సీ 16 సినిమా కూడా వేరే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి.
చరణ్ కోసం ఏకంగా ప్రియాంకా చోప్రా( Priyanka Chopra )నే తీసుకోవాలని అనుకుంటున్నారట.అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి చాన్స్ ఉందని తెలుస్తుండగా ఈ ఛాన్స్ మాత్రం బేబమ్మకి ఇవ్వాలని అనుకుంటున్నాడట బుచ్చి బాబు.ఆల్రెడీ కృతి శెట్టి( Krithi Shetty )తో ఉప్పెన లాంటి హిట్ అందుకున్న బుచ్చి బాబు చరణ్ సినిమాలో కూడా ఆమెను రిఫర్ చేస్తున్నాడట.డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్స్ కొన్నిసార్లు బాగా వర్క్ అవుట్ అవుతాయి.
ఈ క్రమంలోనే RC 16వ సినిమాకు కృతిని తీసుకోవాలని చూస్తున్నారు.మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.