తెలుగు బుల్లితెర పై ఉన్న క్రేజీ జంటలలో రవికృష్ణ, నవ్యస్వామి జంట కూడా ఒకటి.ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసిగట్టుగా వెళ్తుటారు.
బుల్లితెర పై ఏ షోకు వెళ్లినా, ఏ ఈవెంట్‌కి వెళ్లినా జంటగా వెళ్ళడంతో పాటు రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు.నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు.
ఇకపోతే ప్రస్తుతం ఈ జోడి బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు.మామూలుగా అయితే పండుగ ఈవెంట్లతో నవ్యస్వామి, రవికృష్ణ లు కనిపిస్తు సందడి సందడి చేస్తుంటారు.
ఇక వీరిద్దరిని ఢీ షోలోకి టీమ్ లీడర్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఢీ షోలో ముందు నుంచి ఆది, ప్రదీప్, రష్మీ, సుధీర్ ఉన్నంత వరకు బాగానే నడిచింది.
ఆ తరువాత మధ్యలో వర్షిణి కూడా వచ్చింది.ఆ తరువాత వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చింది.
ఇక ఈ సారి కొత్త సీజన్‌లో రెండు జంటలు వచ్చాయి.అఖిల్, రవికృష్ణ, నవ్య కృష్ణ ఇలా అందరూ వచ్చారు.
అఖిల్ సార్థక్‌ని అయితే దారుణంగా ఏడిపించేశారు.హైపర్ ఆది తన పంచులతో అఖిల్‌ను ఒక ఆట ఆడేకున్నాడు.
ఇక అఖిల్ కు బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం రావడంతో బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు.

ఇక నవ్యస్వామి, రవికృష్ణలు ఇద్దరికీ ఢీ షో అంతగా ఉపయోగపడలేదు.ఈ ఇద్దరూ ఢీ షోలో అంతగా పర్పామెన్స్ ఏమీ ఇవ్వలేదు.ఆది మాత్రమే వారిద్దరి మీద పంచులు వేసేవాడు.
ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా ఢీ షోలో కనిపించలేదు.తాజాగా రిలీజ్ చూసిన ప్రోమోలో ఈ ఇద్దరూ కనిపించలేదు.
వారికి బదులుగా ఇంకో కొత్త జోడి వచ్చింది.యూట్యూబర్ నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకొచ్చాడు.
రష్యాలో చదివినప్పుడు పరిచయమైందని చెబుతూ ఓ పిల్లను పట్టుకొచ్చాడు.మొత్తానికి నవ్యస్వామి, రవికృష్ణలు మాత్రం ఢీ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తోంది.
మరి ఈ ఇద్దరూ తమంతట తామే తప్పుకున్నారా? లేదా ఢీ డైరెక్షన్ టీం తప్పించిందా? అన్నది తెలియడం లేదు.