డైరెక్టర్ సాగా తుమ్మ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా నేను c/o నువ్వు. ఇక ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో రూపొందింది.
ఇక ఈ సినిమాలో రత్న కిషోర్, సన్యాసిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్, సాగా రెడ్డి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను అగపే అకాడమీ బ్యానర్ పై సాగా తుమ్మ రెడ్డి, అత్తావలి, శేష్ రెడ్డి, పోలీష్ వెంకట్ రెడ్డి, కే జోసెఫ్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్.ఆర్ రఘునందన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇది 1980లో జరిగిన కథ పల్లెటూర్లో ఓ పేదింటి అబ్బాయి, ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన సంఘటన ఇది.గోపాలపురం అనే ఊరిలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉంటాడు.ఆ సమయంలో కులాల మధ్య వర్గ పోరు జరుగుతూ ఉంటుంది.
ఇక ఆ సమయంలోనే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మారుతి (రత్న కిషోర్) ప్రతాప్ రెడ్డి చెల్లెలు దీపిక (సన్యాసిన్హా) ను చూసి ఇష్టపడతాడు.ఇక ప్రతాప్ రెడ్డికి మాత్రం తన కులానికి సంబంధించిన అమ్మాయిలను ప్రేమించిన.
వారి వెంటపడిన అంతేకాకుండా రాజకీయంగా అతనికి ఎవరైనా పోటీ చేసిన వెంటనే వారిని చంపేస్తుంటాడు.ఇక మారుతిని ఇష్టపడుతుంది.ఓ సమయంలో మారుతి దీపిక చేతిని పట్టుకోవడంతో అది చూసిన ప్రతాప్ రెడ్డి మారుతి తక్కువ కులం కు చెందిన వాడు అని బాగా కొడతాడు.దీపికకు మాత్రం మారుతి పై ప్రేమ తగ్గదు.
ఇక ప్రతాప్ రెడ్డి తన కులానికి చెందిన కార్తీక్ తో దీపిక పెళ్లి ఫిక్స్ చేస్తాడు.అలా చివరికి దీపిక మారుతిని కలుస్తుందా లేదా.
వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా.ప్రతాప్ రెడ్డి చివరికి ఏం చేస్తాడు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
హీరో రత్న కిషోర్ హీరోగా కొత్తగా అడుగుపెట్టిన కూడా తన నటనతో అద్భుతంగా మెప్పించాడు.హీరోయిన్ సన్యాసిన్హా కూడా తన నటనతో ఆకట్టుకుంది.ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా దర్శకుడు ఈ సినిమాను కులం పేరుతో వస్తున్న పరువు హత్యలు వంటి కాన్సెప్ట్ ను అద్భుతంగా చూపించాడు.రఘునందన్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు తమ పన్నులను న్యాయంగా చేశాయి.
విశ్లేషణ:
డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు మంచి కథను తీసుకొని వచ్చాడు.కథ రొటీన్ గా ఉన్న కూడా చాలావరకు అద్భుతంగా చూపించాడు.పైగా పరువు హత్య నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు హైలైట్ గా ఉన్నాయి.పాటలు అద్భుతంగా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
పెద్ద ఆర్టిస్టులు ఉంటే బాగుండేది, అక్కడక్కడ కథ స్లోగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరువు హత్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.