నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 దసరా తర్వాత ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సీజన్ 2 మొదటి ఎపిసోడ్ షూటింగ్ రేపు ప్రారంభం కాబోతుంది.
మొదటి ఎపిసోడ్ లో మెగా స్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నాడని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.కానీ తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ముఖ్య అతిథులు గా రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారని క్లారిటీ వచ్చింది.
నిన్నటి నుండి ఆ విషయం తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక రేపు అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ సమయం కేటాయించారట.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో లో వేసిన సెట్టింగ్ పనులు పూర్తయ్యాయి.రేపు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ అన్నపూర్ణ స్టూడియో లో నిర్మించిన అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన సెట్లో నందమూరి బాలకృష్ణ తో కలిసి సరదా ముచ్చట్లు.సరదా కబుర్లు చెప్పబోతున్నారు.సీరియస్ రాజకీయాల నుండి మొదలుకొని అల్లరి మనవడి చిలిపి పనుల వరకు అన్ని విషయాల గురించి చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ ఇంకా లోకేష్ మాట్లాడుకోబోతున్నారంటూ ఆహా టీం నుండి సమాచారం అందుతుంది.
చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ మధ్య సరదాగా గేమ్స్ కూడా ఉంటాయట.మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎవర్ గ్రీన్ ఎపిసోడ్ అన్నట్లుగా నిలుస్తుంది అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు.
అక్టోబర్ 4వ తారీఖున ఈ షో యొక్క ప్రెస్ మీట్ ఉంటుంది.అదే రోజు మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అప్డేట్ ఇస్తారట. మొదటి ఎపిసోడ్ లో కాకున్నా చివరి ఎపిసోడ్ అయినా బాలకృష్ణ తో చిరంజీవి ఎపిసోడ్ కచ్చితంగా ఉంటుంది అనేది ఆహా టీమ్ నుండి అందుతున్న సమాచారం.