కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ.. వివేక్ వుడ్ అంటూ ట్వీట్!

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ నెల 11వ తేదీ ఒక చిన్న సినిమాగా విడుదల అయి బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న “ది కశ్మీర్ ఫైల్స్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దేశ వ్యాప్తంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు.

 Ramgopal Varma Comments On The Kashmir Files Movie Details, Ram Gopal Varma, To-TeluguStop.com

అనుపమ్ ఖేర్, పల్లవిజోషి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో 1990 లో కశ్మీర్ పండిట్లు పడిన కష్టాలను ఎంతో అద్భుతంగా చూపించారు.

ఒక చిన్న సినిమాగా విడుదలయి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా పై తాజాగా కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…వివేక్ రంజన్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఎంతో ధైర్యంగా తెరకెక్కించారు.ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ పరిశ్రమను పక్కకు తోసి కొత్తరకం ఫిలిం మేకర్స్ ను సృష్టించే విధంగా బాలీవుడ్ ను కాస్తా వివేక్ వుడ్ గా మార్చారు అంటూ ట్వీట్ చేశారు.

Telugu Anupam Kher, Bollywood, Ram Gopal Varma, Rgv Tweet, Kashmir, Tollywood, T

ఈ సినిమా కమర్షియల్ గా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడం కన్నా కొత్తరకం ఫిలిం మేకర్స్ ని తీసుకురావడం అనేది గొప్ప విషయం అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై ట్వీట్ చేయడమే కాకుండా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ సినిమా గురించి వరుస ట్వీట్లు చేస్తూ వర్మ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube