టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు నటి రకుల్( Rakul ).ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి సక్సెస్ అందుకున్నారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ అనంతరం అవకాశాలను కోల్పోతూ వచ్చారు.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో తనకు ఎదురైన అనుభవాల గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.

కెరీర్ మొదట్లో నన్ను చూసినటువంటి కొంతమంది దర్శక నిర్మాతలు నాకు సినిమా అవకాశాలు ఇచ్చేవారు కాదు.ఇచ్చినా కూడా నాకు తెలియకుండానే నన్ను ఆ సినిమా నుంచి తీసేసే వారని తెలిపారు.అయితే మొదట్లో నాకు ప్రభాస్( Prabhas ) సినిమాలో అవకాశం వచ్చింది.
నేను ప్రభాస్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉండేది.ప్రభాస్ కమిట్ అయిన సినిమాలో నేను సెలెక్ట్ అయ్యాను నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగింది.
కానీ నాకు చెప్పకుండా నన్ను ఆ సినిమా నుంచి తీసేసి మరొకరికి అవకాశం ఇచ్చారు.

ఇక ప్రభాస్ కమిట్ అయిన మరో సినిమాకు కూడా నేను సైన్ చేశాను.ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే నన్ను తప్పించారని రకుల్ తెలిపారు.ఇలా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందనుకునేలోపు అవకాశాలు చేజారిపోయాయని తెలిపారు.
అయితే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి అవకాశాలు వచ్చి చేజారిపోతూ ఉండడం సాధారణమని రకుల్ తెలిపారు.ఇలా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పిన ఈమె ఆ సినిమాలు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ఇక తెలుగులో ఈమె చివరిగా కొండ పొలం( Kondapolam ) అనే సినిమాలో నటించి పూర్తిగా సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.