టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్( Rakesh Master ) మరణవార్త సినీ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది.ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు.ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే.
అలాంటి అయన గత కొంతకాలంగా జీవిస్తున్న విధానం అందర్నీ ఆశ్చర్య పరిచింది … అన్ని సినిమాలకు పని చేసిన అయన ఏమి సంపాదించుకోలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అయన ఆస్తులపై ( Rakesh Master Assets ) చర్చ సాగుతుంది .ఒకప్పుడు ఆయన లెజెండరీ కొరియోగ్రాఫర్.స్టార్ హీరోలకు కూడా ఆయన డేట్స్ దొరికేవి కావు.1500లకు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆయన .తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయారు.కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు…కొంత కాలంగా ఆయన ఎక్కువగా వివాదాల్లోనే ఉన్నారు.
కానీ వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
కానీ అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆయన మరణించారు.ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు వెలుగులోకి వస్తున్నాయి .ఇక రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు భారీగానే ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది .ఆయనకు జూబ్లీహిల్స్ లో( Jubilee Hills Bungalow ) పెద్ద బంగలా ఉందని అంటున్నారు .

దాంతో పాటు హైదరాబాద్ శివారులో రెండెకరాల భూమి( Two Acre Land ) కూడా ఉందని తెలుస్తుంది .దాని విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం .అలాగే ఆయనకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.ఆయన ఆస్తుల మొత్తం విలువ 50 కోట్లపైనే అని తెలుస్తోంది.
ఇక రాకేష్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వు వంటి సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.అంతేకాదు వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి స్టార్స్ కి డాన్స్ పాఠాలు కూడా నేర్పించారు.