దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’.
ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల రూపకల్పనలో తన మేజిక్‌ను చూపిన ఈయన ‘పెళ్లిసందD’ లో నటుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రంలో రాఘవేంద్రరావు అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.
మూవీని ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు.ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది.సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకేంద్రుడు తెరకెక్కించిన నాటి బ్లాక్‌బస్టర్ `పెళ్లిసందడి`లో శ్రీకాంత్ హీరో అయితే నేడు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం.శ్రీలీల హీరోయిన్.
‘‘సినిమా ప్రమోషన్స్‌ను ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ రావడం వల్ల సినిమా అందరికీ రీచ్ అయ్యింది .ఈ సినిమా నుంచి విడుదలైన రాఘవేంద్రరావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ , రీసెంట్‌గా నాగార్జున విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది.ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను దసరా సందర్భంగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.