మునుగోడులో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.చౌటుప్పల్ మండలం ఎస్.
లింగోటంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి నిరసన సెగ తగిలింది.
స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు.
పలువురికి గాయాలయ్యాయి.దీంతో పోలీసులు భారీగా మోహరించి ఇరువర్గాలను చెదరగొట్టారు.