అన్నీ మంచి శకునములేలో ప్రభాస్ సర్ ప్రైజ్..?

సంతోష్ శోభన్( Santosh Shobhan ) హీరోగా నందిని రెడ్డి డైరెక్షన్ లో వైజయంతి బ్యానర్ ( Vaijayanti banner )లో వస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే.మహానటి, సీతారామం సినిమాల తర్వాత ఆ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

 Prabhas In Santosh Sobhan Anni Manchi Shakunamule Movie , Anni Manchi Shakunamul-TeluguStop.com

సంతోష్ శోభన్ తో మాళవిక నాయర్ జత కట్టిన ఈ సినిమా లో ప్రభాస్ కూడా ఉన్నాడని చెబుతున్నారు.అదేంటి రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ హీరో సినిమాలో ఉండటం ఏంటని అడగొచ్చు.

ప్రభాస్ వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ ఎవరో కాదు సంతోష్ శోభన్ వాళ్ల నాన్నే.ఆయన దూరమయ్యాక సంతోష్ కి సపోర్ట్ గా ఉంటున్నారు ప్రభాస్.

అందుకే అన్నీ మంచి శకునములే ( Anni Manchi Shakunamule movie )సినిమాలో కూడా ప్రభాస్ పేరుని తెగ వాడేశారట.ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ ఒకటి అలరిస్తుంది.సో ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరించేందుకు సంతోష్ శోభన్ ఇలా ఫిక్స్ చేశాడని చెప్పొచ్చు.ప్రభాస్ కూడా సంతోష్ శోభన్ కి ఈ సినిమాతో అయినా హిట్ రావాలని ఆశిస్తున్నారు.

సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా సంతోష్ శోభన్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.మరి అన్నీ మంచి శకునములే అతన్ని నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube