జబర్దస్త్ షో మీద పోలీసు కేసు

తెలుగు టీవి రియాల్టీ షోలలో కొత్త శకానికి నాంది పలికింది జబర్దస్త్.ఖతర్నాక్ కామెడీ షో.

 Police Case On Jabardasth-TeluguStop.com

విభిన్నమైన స్కిట్స్ – కడుపుబ్బ నవ్వించే కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం.ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా మంచి ప్రజాదరణ అందుకుంది.

ఆ తర్వాత క్వాలిటీ పెంచడం కోసం అనుకుని.కామెడీలో బూతును కూడా మిక్స్ చేయడం మొదలుపెట్టడంతో విమర్శలు కూడా వచ్చాయి.

వీటికి తోడు వరుస వివాదాలతో ఇప్పుడీ జబర్దస్త్ అభాసుపాలవుతోంది.రీసెంట్ గా జబర్దస్త్ లో ప్రసారం చేసిన ఓ స్కిట్ పై కోర్టు నోటీసులు జారీ చేసింది.

భారతీయ న్యాయవ్యవస్థను అవమానించారంటూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు.దీనిని అంగీకరించిన కోర్టు.

జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసింది.గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాలు జబర్దస్త్ ను చుట్టుముట్టాయి.

గతంలో ఓ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఈ కార్యక్రమంపై కేసు నమోదు చేశాడు.ఆ తర్వాత గౌడ మహిళలను అవమానించారంటూ.

కమెడియన్ వేణుపై దాడి కూడా జరిగింది.కామెడీ పేరుతో అసంబద్ధమైన స్కిట్స్ ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అటు పార్టిసిపెంట్స్ తో పాటు ఇటు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగేంద్ర బాబు రోజాలపై కూడా విమర్శలు ఎక్కువయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube