పీఎం ఈ-బస్ సేవా స్కీం... త్వరలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు!

కేంద్ర ప్రభుత్వం( Central Govt ) దేశాన్ని అన్ని రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తులా శ్రమ చేస్తోంది.మరీ ముఖ్యంగా దేశంలో కాలుష్య రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తోంది.

 Pm-ebus Sewa Scheme 10,000 Electric Buses Soon! , Pm, E Bus , Seva, Latest News-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆటో మొబైల్ కంపెనీలకు బోలెడన్ని సబ్సిడీలు అందిస్తున్న సంగతి విదితమే.ఇక కరోనా తరువాత పెరిగిన ఆయిల్ ధరల నేపథ్యంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకానికి ఆమోదం తెలిపింది.

Telugu Electric Buses, Busess, Central, Bus, Lamnch, Latest, Narendra Modi, Pmeb

అవును, ప్రధానమంత్రి ఈ-బస్ సర్వీస్ పథకం( PM-eBus Sewa Scheme ) కింద పట్టణ రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతంగా తయారవుతోంది.ఈ క్రమంలోనే త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకు రానున్నాయి.దీనిపై విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడడం జరిగింది.పీఎం ఈ-బస్ సర్వీస్ స్కీమ్‌కు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టుకు రూ.57,613 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.3 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు మరియు సరైన రవాణా సౌకర్యాలు లేని పట్టణాల్లో ఈ పథకం ప్రాధాన్యత ప్రకారం కేంద్రం ఈ పథకం అమలు చేస్తుంది.

Telugu Electric Buses, Busess, Central, Bus, Lamnch, Latest, Narendra Modi, Pmeb

అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కూడా ఈ పథకంలో చేర్చనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకు రావడం గమనార్హం.ఈ ఎలక్ట్రిక్ బస్సులు పబ్లిక్ ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంలో నడుస్తున్నాయని వెల్లడించారు.రాబోయే పదేళ్లపాటు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.

దీని ద్వారా దాదాపు 45,000 నుంచి 55,000 వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2 విభాగాలుగా అమలు చేయనుంది.అవి, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ మరియు గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్.పట్టణ రవాణా సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులు PPP మోడల్‌లో సర్వీసులు అందిస్తాయి.

ఇంకా ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube