మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

మచిలీపట్నం( Machilipatnam ) వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) చంద్రబాబు( Chandrababu ) పాల్గొన్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Pawan Kalyan Serious Comments On Cm Jagan In Machilipatnam Varahi Vijayabheri Sa-TeluguStop.com

నీపై దాడులు చేసే ధైర్యం ఎవరికైనా ఉందా.? నీపై దాడి చేస్తే బతకనిస్తావా.? సొంత బాబాయిని హత మార్చావు.బాబాయ్ ని చంపిన వ్యక్తులను వెనకేసుకొస్తున్నావు.

ఇలాంటి వ్యక్తి కేంద్రం మెడలు వంచుతాడంట అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.నరేంద్ర మోడీ తో మాట్లాడే ధైర్యం ఉందా.? రాష్ట్ర విభజన ప్రత్యేక హోదాపై( Special Status ) చర్చ సమయంలో సోనియాగాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు.అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సంపద సృష్టించటం కంటే డబ్బులు పంచటం చాలా సులభమని పవన్ వ్యాఖ్యానించారు.చిత్ర పరిశ్రమను ఈ ప్రభుత్వం ఇబ్బందులు చేసినట్టు మరెవరు చేయలేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ భయపడకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు.ఏదైనా మాట్లాడితే నా వ్యక్తిగత జీవితంపై దిగజారి మరి ఈ సీఎం కామెంట్లు చేస్తున్నారు.భీమవరంలో తనపై చేసిన వ్యాఖ్యలకు ఎలక్షన్ కమిషన్ కి( Election Commission ) ఫిర్యాదు చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.సొంత చెల్లికి న్యాయం చేయలేదు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఇప్పుడు జగన్ మాదిరిగా వ్యవహరిస్తే.అసలు జగన్ రోడ్లపైకి వచ్చేవాడా.? చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి.ఏనాడు అప్రజాస్వామికంగా చంద్రబాబు ప్రవర్తించలేదు అని పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube