పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు కానీ మొదటి సినిమా నుండి ఆయన తన సొంత కష్టం మీదనే ఎదిగాడు.
కెరీర్ ప్రారంభం లో ఆయన ఒక్కో సినిమా కోసం కష్టపడినా తీరుని చూస్తే ఎవరికైనా ఆ విషయం అర్థం అవుతుంది.అలా కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఆయన , ఖుషి తర్వాత యూత్ ఐకాన్ గా మారిపోయాడు.
ఆ తర్వాత ఆయనకీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు.మళ్ళీ ‘గబ్బర్ సింగ్'( Gabbar Singh ) సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి నెంబర్ స్థానం లో కూర్చుకున్నాడు, అత్తారింటికి దారేది తర్వాత వరుసగా మూడు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ, ‘వకీల్ సాబ్’ మరియు భీమ్లా నాయక్ సినిమాలతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇప్పుడు ఆయన వరుసగా నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ గా ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో – ది అవతార్’.( Bro-The Avatar ) ఈ చిత్రం జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు.
తమిళం మంచి రివ్యూస్ ని రప్పించుకున్న ఓటీటీ చిత్రం ‘వినోదయ్యా చిత్తం'( Vinodhaya Sitham ) ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు.
మరో 5 రోజుల షూటింగ్ తో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తి అవుతుంది.అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తాడని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది.
ఈ పాత్ర కోసం నిర్మాతలు ఆయనకీ 45 కోట్ల రూపాయిలు ఇచ్చాడని టాక్.

నిర్మాతలు పవన్ కళ్యాణ్ ఉన్న ఈ 15 నిమిషాల పాత్రని చూపిస్తూ, బయ్యర్స్ కి వంద కోట్ల రూపాయిల రేంజ్ లో ఈ చిత్రాన్ని అమ్మేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఆంధ్ర బిజినెస్ 55 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.అలాగే నైజాం లో 30 కోట్లు, ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలకు కలిపి 15 కోట్ల రూపాయిలు ఇలా మొత్తం మీద 100 కోట్ల బిజినెస్( 100Crores ) ని ఈ చిత్రం చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొంతమంది ఈ వార్తలను ఖండించారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తాడు అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
దయచేసి ఇలాంటి రూమర్స్ ని నమ్మొద్దు అంటూ సినిమాకి సంబంధించిన కొంతమంది స్టాఫ్ ని విచారించినప్పుడు చెప్పుకొచ్చారు.రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
రేపు సాయంత్రం సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయబోతుంది మూవీ టీం.