పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరో లు గా నటించిన బ్రో సినిమా( Bro Movie ) మరో రెండు గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుంది అంటూ మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
పీపుల్స్ మీడియా( Peoples Media Factory ) వారు ఈ సినిమాను దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.వంద కోట్ల వసూళ్లు నమోదు అయితే మిగిలిన మొత్తం ఇతర రైట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది అనేది వారి నమ్మకం అయ్యి ఉంటుంది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్( Bro Movie Pre Release Business ) విషయానికి వస్తే నైజాం ఏరియాలో ఈ సినిమా ఏకంగా 30 కోట్ల రూపాయల ధర పలికింది.సీడెడ్ లో రూ.13.3 కోట్లు బిజినెస్ చేసింది.ఇక ఉత్తరాంధ్ర లో రూ.19.5 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 6.4 కోట్లు, గుంటూరు లో 7.4 కోట్లు కృష్ణ లో 5.24 కోట్లు నెల్లూరు లో 3.4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తం బ్రో సినిమా రూ.80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.ప్రీ రిలీజ్ బిజినెస్ అంతకు మించి కూడా చేసే అవకాశం ఉన్నా కూడా నిర్మాతలు చిన్న మొత్తానికే సినిమాను అమ్మాలనే ఉద్దేశ్యంతో సినిమాను అక్కడ ఇక్కడ తక్కువకు అమ్మడం జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తే ఓవర్సీస్ లో మరో పాతిక కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.అక్కడ ఈ సినిమా దాదాపుగా రూ.15 కోట్ల బిజినెస్ చేసింది అనేది టాక్.మొత్తానికి పవన్ బ్రో స్టామినాకి బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం ఏమీ కాదు.
కానీ ఆయన ఈ సినిమా లో ఎంత సమయం ఉంటాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.