వరుణ్ కొత్త ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.ఈయన ముందు నుండి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

 Bollywood Beuty In Varun Tej Next Movie, Gandeevadhari Arjuna, Praveen Sattaru,-TeluguStop.com

అందుకే ఈయన మెగా ఇమేజ్ నుండి బయట పడి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఇక వరుస హిట్స్ అందుకుంటున్న వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాను లైన్లో పెట్టబోతున్నాడు అనే టాక్ గత రెండు రోజులుగా వైరల్ అయ్యింది.

Telugu Bollywoodbeuty, Karuna Kumar, Nora Fatehi, Praveen Sattaru, Sakshi Vaidya

వరుణ్ తేజ్ లైనప్ లో ప్రజెంట్ రెండు సినిమాలు ఉన్నప్పటికీ మరో డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్టు టాక్.ఈయన ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్ ( Director Karuna Kumar )తో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నాడు అని ఈ జులై 27న ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ కాబోతుంది అని టాక్.ఇక ఈ ప్రాజెక్ట్ ఇంకా అఫిషియల్ గా కన్ఫర్మ్ కాకుండానే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నటిస్తుంది అనే న్యూస్ వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ నోరా ఫతేహి( Bollywood Nora Fatehi ) కీలక రోల్ లో కనిపిస్తుందట.

ఈమె ఫిమేల్ లీడ్ కాకపోయిన కీలక రోల్ అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు అని మరిన్ని డిటైల్స్ ముందు ముందు రానున్నాయని టాక్.

చూడాలి నిజంగానే ఈ సినిమా ఈ నెలలోనే లాంచ్ ఉంటుందో లేదో.

Telugu Bollywoodbeuty, Karuna Kumar, Nora Fatehi, Praveen Sattaru, Sakshi Vaidya

ఇక ప్రజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ లో ముందుగా రిలీజ్ కానున్న మూవీ ”గాండీవధారి అర్జున”.( Gandeevadhari Arjuna ) ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube