Pawan Kalyan epattam village : పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇప్పటం గ్రామస్తులు

ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరు తో అక్రమంగా ఇల్లు కూల్చేసిన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడాని హర్షిస్తు ఇప్పటం గ్రామ రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.

 Pawan Kalyan Picture Is Worshiped By The Epattam Villagers , Pawan Kalyan-TeluguStop.com

ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇల్లులు కూల్చివేత సమస్యపై నిలబడి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లి జనసేన పార్టీ తరఫున మాకు అండగా నిలబడినందుకు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మా గ్రామానికి వచ్చి మాకు అండగా నిలబడినందుకు, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడాని హర్షిస్తూ కృతజ్ఞతలతో పాలభిషేకం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూజనసేన పార్టీ ఎక్కడ సమస్య ఉన్న చోట ముందుండి పోరాడుతుందని, ఇప్పటం గ్రామానికి ఏ సమస్య వచ్చిన జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని, కూల్చేవాడు ఉంటే కట్టేవారు ఉంటారని, ఈ వైసీపీ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన కానుంచి కుల్చడం తప్ప ఎక్కడ ఒక్క బిల్లింగ్ కూడా కట్టే పరిస్థితి లేదని, ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్లు కూలుస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బాధితులకు అండగా ఉంది.

ప్రతి ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, చేనేత విభాగం కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, ఇప్పటం గ్రామస్తులు, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, చిల్లపల్లి యూత్ సభ్యులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube