Lion Safari Drive :టూరిస్టులపైకి ఎక్కి వారిపై పడిబోర్లిన సింహం.. వీడియో వైరల్..

సాధారణంగా టూరిస్టులు సఫారీకి వెళ్ళినప్పుడు జంతువులను కాస్త దూరంలో చూసి ఎంజాయ్ చేస్తారు.కానీ తాజాగా వేరే రేంజ్‌లో వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఒక సఫారీ డ్రైవ్ కనిపించింది.

 A Lion Climbed On Top Of The Tourists And Attacked Them Video Viral , Lion , Vir-TeluguStop.com

ఈ సఫారీ టూర్ లో ఒక పెద్ద సింహం డైరెక్ట్ గా టూరిస్టులపైకి దూకేసింది.అనంతరం అది వారిపై పండి బోర్లుతూ కనిపించింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.దీనికి 29 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.91 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వాహనం అడవిలో వెళుతూ కనిపించింది.

ఆ వాహనం వైపు ఒక పెద్ద ఆడ సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది.అనంతరం అది వాహనంలోకి దూకింది.ఆపై అందులో కూర్చున్న టూరిస్టులపైకి ఎక్కింది.తర్వాత వారికి తన మూతిని రాస్తూ వారిపై బోర్లుతూ ఆశ్చర్యపరిచింది.టూరిస్టులందరూ భయం లేకుండా దానిని తాకుతూ ఎంజాయ్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.వామ్మో అంత పెద్ద సింహం ఒకేసారి మీద పడితే గుండె ఆగిపోదా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఒకవైపు ప్యాంట్స్ తడుపుకుంటూనే మరోవైపు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందడం అంటే ఇదేనేమో అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.

మనుషులకి హాని చేయకుండా వారిని ఇలా ప్రేమగా కౌగిలించుకునేందుకు ఈ సింహానికి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చారో ఏమో అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సింహాన్ని చాలా ప్రేమతో పెంచారు అనుకుంటా.

అందుకే ఇది ప్రేమ కురిపిస్తోందంటూ ఇంకొక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube