మరోసారి సృష్టికి విరుద్ధంగా చైనీయులు ప్రయోగాలు.. ఎక్కువ పాల కోసం సూపర్ ఆవులు!!

చైనా వాళ్లు తమ ప్రయోజనాల కోసం రకరకాల ప్రయోగం చేస్తుంటారు.వాతావరణాన్ని మార్చడానికి కూడా వారు షాకింగ్ ప్రయోగాలు చేస్తుంటారు.

 Once Again The Chinese Are Experimenting Against Creation.. Super Cows For More-TeluguStop.com

కాగా తాజాగా వీరు ఇప్పుడు ఆవులపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.చైనా శాస్త్రవేత్తలు రీసెంట్‌గా ప్రతి సంవత్సరం 18 టన్నుల పాలు ఇవ్వగల మూడు సూపర్ ఆవులను తయారు చేశారు.

సోమాటిక్ సెల్ క్లోనింగ్ అనే పద్ధతిని ఉపయోగించి నార్త్‌వెస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.ఇందులో ఆవుల నుంచి కణాలను సేకరించి వాటి నుంచి పిండాలను తయారు చేస్తారు.

కాగా వీరి ప్రాజెక్టులో మొదటి సూపర్ ఆవు ఆరోగ్యంగా జన్మించింది.అది 57 కిలోగ్రాముల బరువు ఉంది.

Telugu China, Chinese, Method, Cows-Latest News - Telugu

పాల ఉత్పత్తుల కోసం చైనా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందట.దేశంలోని రెండు ఫెసిలిటీస్‌ వద్ద 30 మంది ఉపాధ్యాయులు, విద్యార్థుల బృందం ఈ ప్రాజెక్ట్‌కు సహాయం చేసింది.నాణ్యమైన ఆవులతో బలమైన పాడి పరిశ్రమను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం.ఆవుల ఆరోగ్యంపై ఈ క్లోనింగ్ పద్ధతి వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించడానికి మరింత పరిశోధన అవసరం కావచ్చు.

Telugu China, Chinese, Method, Cows-Latest News - Telugu

సాధారణంగా క్లోనింగ్ మెథడ్ వల్ల జంతువులు చనిపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది.క్లోనింగ్ చేసిన జంతువులలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.క్లౌనింగ్ మెథడ్‌ లో ఏ లోపం లేకుండా ఉంటేనే వీటి ఆరోగ్యం మంచిగా ఉంటుంది.కొన్ని అధ్యయనాలు క్లోన్ చేయని జంతువులతో పోలిస్తే క్లోన్ చేయబడిన జంతువులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయని.

వాటి జీవితకాలం తక్కువగా ఉండవచ్చని చూపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube