వైసీపీ ప్రభుత్వ తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తాను గతంలో మీకు వీర విధేయుడిని…ఇప్పుడు కాదని తెలిపారు.
మౌనంగా వెళ్లిపోదామనుకుంటే తనను విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.ఈ క్రమంలోని మంత్రి కాకాణిపై మండిపడ్డారు.
ఓదార్పు యాత్ర సమయంలో జగన్ వెంట వెళ్లవద్దని కాకాణి అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.తను చేసింది నమ్మక ద్రోహం అయితే ఆనంకు చేసిన మోసం కాకాణిది నమ్మక ద్రోహం కాదా అని నిలదీశారు.
ఆనంను కాకాణి ఏ విధంగా క్షోభ పెట్టారో ప్రజలకు తెలుసని వెల్లడించారు.