అమెరికాలో ఉంటున్న ఎంతో మంది భారతీయులు తమ ప్రతిభని ఎప్పటికప్పుడు చాటుతూ ప్రపంచానికి భారతీయ సత్తాని తెలియచెప్తూ ఉంటారు.విద్యా విధానంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ, లేక పరిశోధన రంగాలలో ఇలా ప్రతీ రంగంలో అమెరికాలో భారతీయుల హవా ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది…అయితే
తాజాగా ఇండో అమెరికన్ కావ్య అమెరికాలో తన ప్రతిభని చాటుకుంది.ప్రపంచ దృష్టిని సైతం తనవైపుకి మరల్చింది.19 ఏళ్ల కొప్పారావు కావ్య అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన “2019 నేషనల్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఎడ్యుకేషనల్ అవార్డు కైవసం చేసుకుంది.
ఎంతో ప్రమాదకరమైన బ్రెయిన్ కాన్సర్ కి మెరుగైన చికిత్సని అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో “గ్లియో విజన్” అనే సరికొత్త విధానాన్ని ఆమె ఆవిష్కరించింది.దాంతో ఆమెకి ఈ అవార్డు లభించింది.అంతేకాదు ఈ పరిసొధనాకి గాను ఆమెకి రూ.7లక్షలకి పైగా నగదు బహుమతిని ప్రకటించింది.
తాజా వార్తలు