అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ కి వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతి మహిళని ఎంపిక చేశారు.భారత సంతతికి చెందిన మేఘా నర్వేకర్ ఈ ఘనతని సాధించారు.
అయితే ఇదే యూనివర్సిటీ లో ఆమె డెవలప్‌మెంట్ అండ్ అలూమ్ని రిలేషన్స్ కార్యాలయంలో 32ఏళ్లుగా సేవలందించిన ఆమెకి ఈ గౌరవం దక్కింది.
ఈ సంవత్సరం జూన్ తో పస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న లెస్లీ క్రూహ్లీ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానాన్ని మేఘా తోనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అనుకున్నదే తడవుగా మేఘాని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశారు…అయితే ఆమె కొత్త భాద్యతలు తీసుకున్నాకానీ డీఏఆర్‌కు ఆమె సేవలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయని తెలిపారు…మేఘా ఎంతో ధైర్యవంతురాలని, వర్క్ విషయంలో రాజీ పడదని, ఈ పదవి మేఘాకి ఇవ్వడం సరైన నిర్ణయమని పలువురు కొనియాడారు.
.
తాజా వార్తలు