పాస్‌పోర్ట్ ఉండటం ఎంతకైనా మంచిది.అవసరమైనపుడు హఠాత్తుగా పరుగులు తీసేకంటే ముందుగా చేయించుకుంటే మేలు.
పాస్‌పోర్ట్ అంతర్జాతీయంగా ప్రయాణాలు చేయడానికి వీలు కల్పిస్తుంది.ఇదే ఆధారం కూడా.
అయితే, మీకు పాస్‌పోర్ట్ తీసుకోవాలనుందా? కానీ, ఆ ప్రక్రియ పెద్దగా ఉంటుందని ఆందోళన చెందున్నారా? అయితే, ఇక ఆ అవసరం లేదు.సింపుల్‌గా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ వివరాలు తెలుసుకుందాం.దీనికి మీ ఇంటి వద్ద ఉన్న పోస్టాఫీస్ నుంచి పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక పాస్‌పోర్ట్ అధికారిక వెబ్‌సైట్ p్చటటఞౌట్టజీnఛీజ్చీ.జౌఠి.జీn ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే విధానం
అధికారిక వెబ్‌సైట్ అయిన పాస్‌పోర్ట్ సేవ, పాస్‌పోర్ట్ ఇండియా ఓపెన్ చేయాలి.ఆ తర్వాత వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి, క్యాప్చా కోడ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.రిజిస్టర్డ్ లాగిన్ లాగిన్ ఐడీ ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.అందులోఫ్రెష్ పాస్‌పోర్ట్ లేదా రీ ఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్‌పై క్లిక్ చేయాలి.కావాల్సిన వివరాలు అక్కడ నమోదు చేసిన తర్వాత అప్లికేషన్‌ను ‘అప్‌లోడ్ ఏ ఫాం’పై క్లిక్ చేసి, పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ద్వారా మీ అపాయింట్‌మెంట్‌ను ఫిక్స్ చేసుకోవాలి.
‘ప్రింట్ అప్లికేషన్ రిసీట్’పై క్లిక్ చేసి, ప్రింటౌట్‌ను తీసుకోవాలి.ఇది తర్వాత ప్రక్రియకు ఉపయోగపడుతుంది.
లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లోని సీఎస్‌సీ కౌంటర్‌లో కూడా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్స్
పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ కోసం మీ వద్ద ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, వయస్సు ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్, మొబైల్, వాటర్ బిల్, గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.