నిహారికతో పెళ్లి... మళ్లీ ఈ టాపిక్‌ ఎందుకు వచ్చినట్లు?

చాలా సంవత్సరాలుగా హీరో నాగశౌర్య మరియు మెగా డాటర్‌ నిహారికల ప్రేమ విషయమై ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.నిహారికతో నాగశౌర్య ఒక చిత్రాన్ని చేయడం జరిగింది.

 Niharika Konidela Marriage With Naga Shourya Again Goes Viral-TeluguStop.com

ఆ సినిమా షూటింగ్‌ సమయం నుండి వీరిద్దరి గురించి చిత్ర విచిత్రమైన పుకార్లు రావడం మొదలు అయ్యింది.మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు వీరిద్దరు కొట్టి పారేశారు.

అయినా కూడా మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.ఆమద్య కాస్త సీరియస్‌గానే నిహారిక రియాక్ట్‌ అవ్వడంతో గత సంవత్సర కాలంగా మీడియాలో ఆ వార్తలు లేవు.

నిహారికతో పెళ్లి మళ్లీ ఈ టాప�

మీడియాతో పాటు జనాలు కూడా ఆ విషయాన్ని మర్చి పోయారు.ఇలాంటి సమయంలో మరోసారి ఇద్దరి మద్య ఏమీ లేదు అంటూ వార్తలు రావడం మొదలైంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడుతూ తామిద్దరి మద్య ఎలాంటి ప్రేమ వ్యవహారం సాగలేదు, అసలు తాము మంచి స్నేహితులుగా మాత్రమే ఉన్నాము అంటూ చెప్పాడు.అయిపోయిన విషయం గురించి ఇప్పుడు మళ్లీ నాగశౌర్య ఎందుకు కెలికినట్లు అంటూ మెగా ఫ్యాన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిహారికతో పెళ్లి మళ్లీ ఈ టాప�

కావాలని నాగశౌర్య మళ్లీ ఈవిషయాన్ని మీడియాలో చర్చ జరిగేలా చేశాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నాగశౌర్యకు ఈమద్య కాలంలో సినిమాలు పెద్దగా సక్సెస్‌లను తెచ్చి పెట్టలేక పోతున్నాయి.ఆ కారణంగా మీడియాలో జనాల మద్య ఉండాలనే ఉద్దేశ్యంతో నిహారికతో ప్రేమ విషయాన్ని మళ్లీ మీడియాలో నానేలా చేశాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మీడియాలో వస్తున్న వార్తలు మళ్లీ నాగశౌర్యను ఫేమస్‌ అయ్యేలా చేశాయి.

మరి నిజంగానే నాగశౌర్య ఆ ఉద్దేశ్యంతో ఈ టాపిక్‌ను తీసి ఉంటాడా అనేది అతడికే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube