Niharika Konidela : వాళ్లు నన్ను చంపేస్తున్నట్టు కలలు వచ్చేవన్న నిహారిక.. చరణ్ టీం గురించి తెలియదంటూ?

టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక( Mega Daughter Niharika ) దాదాపు నాలుగేళ్ల తర్వాత నటిగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.కాగా నిహారిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్‌ పిక్సెల్స్‌.

 Niharika Konidela Latest Interview On Social Media Trolling-TeluguStop.com

కాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.నిహారిక నటించిన ఈ వెబ్ సిరీస్ మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

నటన.ఇదొక ఛాలెంజింగ్‌ కెరీర్‌.ఆసక్తితోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను.

Telugu Pubg, Ram Charan, Tollywood, Games-Movie

వెండితెర, ఓటీటీ ( OTT )ఏదైనా సరే వందశాతం కష్టపడే వర్క్‌ చేస్తున్నాను.భవిష్యత్తు లో సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.అందులో ఎటువంటి సందేహం లేదు.

అయితే, ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లేకపోతే చేయనని ఇప్పటివరకూ నేనెవరికీ చెప్పలేదు.వాళ్లకు వాళ్లే ఊహించుకుని నా వరకూ కొన్ని ప్రాజెక్ట్‌లు తీసుకురాలేదు.

ఆయా ప్రాజెక్ట్‌లు విడుదలయ్యాక నన్ను కలిసి.మీరు చేయరనుకున్నాం.

అందుకే ఆ రోల్‌ మీకు చెప్పలేకపోయాం అని చెప్పారు.ఆ సమయంలో కాస్త బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది నిహారిక.

డెడ్‌ పిక్సెల్స్‌( Dead Pixels ) అనే వెబ్ సిరీస్ అంగీకరించడానికి కారణం గాయత్రి పాత్ర.

వాస్తవానికి ఇది చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది.ఈ పాత్ర పోషించడానికి నేను కష్టపడ్డాను.ఎందుకంటే, సాధారణంగా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.

కోపంలో నా హావభావాలు క్యూట్‌గా ఉంటాయి.కానీ, గాయత్రి కొంచెం సీరియస్‌గా ఉంటుంది.

కోపం వస్తే ఆమె హావభావాలు వేరేలా ఉంటాయి.దానివల్ల షూట్‌లో కొంచెం ఇబ్బందిపడ్డాను అని చెప్పుకొచ్చింది నిహారిక.

లాక్ డౌన్ లో పబ్జి గేమ్( PUBG ) కి బాగా కనెక్ట్ అయ్యాను.ఎంతలా అంటే నన్ను ఎవరో చంపేస్తున్నట్టు కలలు కూడా వచ్చేవి.

అందుకే రెండుసార్లు ఫోన్ నుంచి ఆ పబ్జి గేమ్ ను తొలగించేసాను అని చెప్పుకొచ్చింది నిహారిక.

Telugu Pubg, Ram Charan, Tollywood, Games-Movie

సోషల్‌ మీడియా( Social Media )లో వచ్చే కామెంట్స్‌ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలు ఉన్నాయి.అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు.అందుకే రాను రాను నేను ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశాను.

ముఖ్యంగా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్‌ను చూడను.పుష్ప లో నేను నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు అని తెలిపింది నిహారిక.

అనంతరం తన సోదరుడు రామ్‌ చరణ్‌( Ram Charan ) ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.అవునా.

ఏ టీమ్‌ కొంటున్నారు? హైదరాబాద్‌ టీమ్‌ కొంటున్నారా? ఏమో మరి నా వరకూ ఈ వార్త రాలేదు.ఈ ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడుగుతాను అని బదులిచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube