క్రికెట్ ను మన దేశంలో ప్రతి ఒక్కరూ దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయంగానే చూస్తారు.నిజానికి అది కేవలం ఒక ఆట అయినా కూడా దాన్ని మాత్ర ఆ విధంగా ఓన్ చేసుకుంటున్నారు చాలామంది.
ఇక మొన్న టీ20లో పాకిస్తాన్ మీద ఇండియా ఓడిపోవడంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరట్లేదు.ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
ఇప్పుడు దేశద్రోహం అనే మాట ఈ మ్యాచ్ సందర్భంగా బాగా వినిపించాయి.ఎందుకంటే పాకిస్తాన్ గెలిస్తే మన దేశంలో చాలామంది సంబురాలు చేసుకుంటే వారి మీద దేశ ద్రోహం పెట్టాలంటూ డిమాండ్ వచ్చింది.
అయితే ఇప్పుడు మరోసారి ఆ నినాదం వస్తోంది.ఈ సారి మాత్రం సానియా మీర్జా మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆమె మీద కూడా దేశ ద్రోహం పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఎందుకంటే టీ20 మ్యాచుల సందర్భంగా ఆమె పాకిస్తాన్ కు మద్దతుగా వ్యవహరించడం ఇందుకు కారణం అయింది.
పాకిస్తాన్ ఆస్టేలియాతో ఆడుతున్న క్రమంలో ఆమె నేరుగా స్టేడియంకు రావడం, పైగా పాకిస్తాన్ గెలవాలంటూ ఆకాంక్షించడంతో ఇండియన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సానియా మీర్జా పాకిస్థాన్ కోడలు అయినా కూడా ఇండియా పౌరురాలిగానే ఉన్నారు.

మన దేశానికి బద్ధ శతృవు అయిన పాకిస్తాన్‌కు ఆమె మద్దతు ఇవ్వడం ఏంటని అంతా ఫైర్ అవుతున్నారు.మొన్న కంగనా రనౌత్ ఇండియాకు 2014లో స్వాతంత్య్రం వచ్చిందని చేసిన కామెంట్లతో ఆమె మీద దేశ ద్రోహం పెట్టాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది.కాబట్టి ఇప్పుడు దేశానికి బద్ధ శత్రువును పొగుడుతున్న సానియా మీర్జా మీద కూడా దేశ ద్రోహం పెట్టాలంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.కాగా ఈ విషయం మీద మన ఇండియా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు.
కానీ అభిమానుల నుంచి వస్తున్న విమర్శల మీద అటు సానియా కూడా స్పందించకపోవడం గమనార్హం.