ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఎంతో మంది వినియోగదారులను తమ ఖాతాలోకి వేసుకుంది.ఈ ఓటీటీ ప్లాట్‌పాం తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం పరిశీలిస్తోంది.
అదే, ఆటోపే ఫీచర్.దీంతో నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్ గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా రెనివల్ అయిపోతుంది.దీనికి యూజర్లు పేమెంట్ చేసే సమయం ఆదా అయిపోతుంది.యూపీఐ ఖాతాలో నుంచి సబ్‌స్క్రిప్షన్ మనీ డెబిట్ అయిపోతుంది.ఈ ఆటోపే ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకే అందుబాటులో ఉంది.భారత్ నెట్‌ఫ్లిక్స్ ఎండీ గుంజన్ ప్రధాన్ ఆటోపే గురించి మాట్లాడుతూ.
‘ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు సైన్‌అప్ అయ్యే ప్రతిఒక్కరూ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఆటోపే యూపీఐ ద్వారా చెల్లిపంపులు చేపట్ట వచ్చన్నారు.ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ఆటోపే యూపీఐలో ‘బిల్లింగ్ డిటేయిల్స్’లోకి వెళ్లి స్వీచ్ చేసుకుంటే సరిపోతుంది.
నెట్‌ఫ్లిక్స్ ఆటోపే ఫీచర్.కొత్త యూజర్లు యాక్టివేట్ చేసుకునే విధానం.
ముందుగా మీ ఈ మెయిల్ ఐyీ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు ఖాతాకు యాక్సెస్ చేయవచ్చు.మీ ఖాతా సృష్టించగానే.
నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ జాబితా వస్తుంది.అందులో రూ.499, 699, 799 ఎంచుకోవాల్సి ఉంటుంది.మీరు కేవలం మొబైల్ యాక్సెస్ కోసమే అయితే, రూ.199 తీసుకోవడమే మేలు.ప్లాన్ ఎంపిక అయిన తర్వాత పేమెంట్ మెథడ్‌ను సెట్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆటోపే ఆప్షన్‌ను ఎంచుకుంటే. పేటీఎం లేదా యూపీఐ ఐడీ వివరాలు అడుగుతుంది.యూపీఐ ఆటోపే సరికొత్త యూపీఐ పేమెంట్ యాప్ దీంతో ఆటోమెటిగ్గా ప్రతినెలా చెల్లింపులు చేయవచ్చు.ఈ కొత్త పేమెంట్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది.ఒకవేళ సమయానికి చెల్లింపులు చేయడం మర్చిపోతే, ఆటోమెటిక్ పేమెంట్ అయిపోతుంది.నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు మరింత అనుభవం, స్వేచ్ఛ, నియంత్రణను అందించడమే లక్ష్యమని, వారి ఇష్టమైన కంటెంట్‌ను ప్రకటనలు లేకుండా తమ ఎయిర్‌టెల్, వీఐ, జియో కస్టమర్లకు మరింత సులభంగా అందిస్తుందని ప్రధాన్ తెలిపారు.