యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందితా శ్వేత తన యాక్టింగ్‌తో అదిరిపోయే క్రేజ్ దక్కించుకుంది.ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
కానీ ఈ సినిమా తరువాత ఆమె చాలా చిత్రాల్లో నటించింది.
కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరుతీసుకొచ్చింది లేదు.
దీంతో ఆమె అడపాదడపా వినూత్న పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతోంది.కాగా తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఐపీసీ 376’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నందితా శ్వేత ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.కాగా తాజాగా ఈ సినిమాలోని ఆమె పోలీస్ లుక్‌ను చిత్ర యూనిట్ నందితా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
ఖాకీ ప్యాంటు, నల్ల చొక్కాతో అదిరిపోయే స్టయిల్‌లో లాఠీ పట్టుకుని నిల్చున్న నందితా శ్వేత లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ టైటిల్ చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాను రామ్ కుమార్ సుబ్బరాయన్ డైరెక్ట్ చేస్తుండగా ఎస్.ప్రభాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.