ప్రముఖ జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందిన వారిలో వేణు స్వామి( Venu Swamy ) ఒకరు.వేణు స్వామి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు.
అయితే ఈయన చెప్పిన విధంగా కొంతమంది విషయంలో నిజం కావడంతో ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచారు.అయితే ఇటీవల కాలంలో ఈయన చెప్పిన జాతకాలు నిజం కాకపోవడమే కాకుండా ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు.
ముఖ్యంగా వేణు స్వామి నాగచైతన్య( Nagachaitanya ) శోభిత( Sobhita ) జాతకం గురించి చెప్పడంతో ఈయన భారీ స్థాయిలో వివాదాలలో నిలిచారు.
నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తర్వాత వీరు విడిపోతారంటూ ఈయన జాతకం చెప్పారు.దీంతో ఎంతోమంది ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయంలో వేణు స్వామి భార్య వీణ వాణి మీడియాపై చిందులు వేశారు.
అనంతరం టీవీ ఫైవ్ మూర్తి( Murthy ) తనకు కోట్లలో డబ్బు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు అంత డబ్బు మేము ఇవ్వలేమని ఆత్మహత్య మాకు శరణ్యం అంటూ ఈ దంపతులు పలు వీడియోలను విడుదల చేశారు.
ఇక వీరి వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది.వేణు స్వామి ప్రజలను జాతకాల పేరుతో మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోని మార్ఫింగ్ చేశారని ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వేణు స్వామి పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు( Nampally Court ) ఆదేశాలను జారీ చేసింది.
దీంతో మరోసారి వేణు స్వామి పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు.నాగచైతన్య శోభిత వ్యవహారం తర్వాత ఈయన ఇతర సెలబ్రిటీల గురించి ఎక్కడ మాట్లాడలేదు అలాగే సోషల్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.