ఫస్ట లుక్‌తో విజయంపై గురిపెట్టిన నాగశౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య రీసెంట్‌గా అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా శౌర్యకు మంచి పేరును తీసుకొచ్చింది.

 Naga Shaurya Archer First Look Released, Naga Shaurya, Archer, Ns20, First Look-TeluguStop.com

ఇక ప్రస్తుతం తన కెరీర్‌లో 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాగశౌర్య, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట.ఇప్పటికే ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అందులో అదిరిపోయే బాడీతో మనకు శౌర్య కనిపించాడు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య ఆర్చరీ ఆటగాడిగా మనకు కనిపిస్తాడు.

ఇక ఈ సినిమాలో శౌర్య స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.పూర్తిగా ఫిట్ బాడీతో, అదిరిపోయే సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాడు ఈ హీరో.

జుట్టు కూడా పెంచిన నాగశౌర్య, ఈ సినిమా కోసం తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఇక తనకెంతో ఇష్టమైన ఆర్చరీ ఆటలో విజయం సాధించేందుకు ఓ యువకుడు ఎలాంటి కష్టాలు, అవాంతరాలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ నాగశౌర్యకు బాగా నచ్చిందని, అందుకే ఇంతలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా ఈ సినిమాను నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.ఈ సినిమాతో శౌర్య అదిరిపోయే సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube