కరోనా తర్వాత సినిమాలన్నీ కూడా వరుసగా విడుదలవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీకి దిగాయి.ఈ క్రమంలోనే ఈ ఏడాది పలు భాషల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి వాటిలో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఒకటి.ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలన విజయం అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో కేవలం కమల్ హాసన్ మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి హీరోలు కూడా నటించారు.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్ర అంటూ సూర్య ఎంట్రీ ఇచ్చారు.ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా మారిందని చెప్పాలి.రోలెక్స్ సార్ అంటూ సూర్య నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.ఇకపోతే తాజాగా ఈ రోలెక్స్ పాత్ర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా రోలెక్స్ పాత్ర గురించి ఈయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన యూనివర్సల్ లో 10 సంవత్సరాలకు సరిపడా సినిమాలు ఉన్నాయని 10 సంవత్సరాల వరకు తాను సెట్ అయ్యానట్టు నవ్వుతూ తెలియజేశారు.ప్రస్తుతం తాను విజయ్ తో సినిమా చేస్తున్నానని ఈ సినిమా తర్వాత కమల్ సార్ తో మరోసారి విక్రమ్ సీక్వెల్ గురించి ప్రస్తావిస్తానని తెలిపారు.అదే విధంగా ఖైదీ సీక్వెల్ గురించి కూడా పనులు మొదలు పెట్టాలని తెలిపారు.ఇవే కాకుండా రోలెక్స్ పాత్ర ఆధారంగా మరొక కొత్త సినిమా చేస్తానంటూ ఈయన షాకింగ్ న్యూస్ చెప్పారు.
అయితే తన యూనివర్స్ లో ఉన్న ఈ సినిమాలు ముందు వెనుక రావచ్చు ఏవి ఎప్పుడొస్తాయో చెప్పలేనని తెలిపారు.కేవలం ఐదు నిమిషాలు రోలెక్స్ పాత్ర ద్వారానే బీభత్సం సృష్టించిన లోకేష్ ఏకంగా ఈ పాత్ర ద్వారా సినిమా చేయడం అంటే ఆ సినిమా ఎలా ఉంటుందోనని అంచనాలు పెరిగిపోతున్నాయి.
అసలు రోలెక్స్ ఎవరు? ఆయన డ్రగ్ మాఫియాగా మారడానికి కారణం ఏంటి అని విషయాల గురించి ఈయన మరొక సినిమాని చేయబోతున్నారని తెలియడంతో ఈ విషయం కాస్త ఆసక్తికరంగా మారింది.