రంగస్థలం సీక్వెల్ లీక్ చేసిన జక్కన్న.. సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.ఇక రామ్ చరణ్ తన కెరీర్లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు అని చెప్పాలి.

 Rangasthalam Sequel Leaked Jakanna Is There A Sequel Or Not, Rangasthalam , Sequ-TeluguStop.com

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.ఇకపోతే రామ్ చరణ్ కెరియర్ లో రంగస్థలం సినిమా కూడా ఒక మైలు రాయి అని చెప్పాలి.

ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతం.రామ్ చరణ్లో దాగి ఉన్న మరో యాంగిల్ ని కూడా బయటకు చూపించారు.ఇలా రంగస్థలం సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.గతంలో సుకుమార్ రాంచరణ్ తో కలిసి రంగస్థలం సినిమా సీక్వెల్ చిత్రాన్ని చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రాజమౌళి రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ… చరణ్ సుకుమార్ కలిసి చేయబోయే సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు.ఇప్పటికే చిత్ర ప్రారంభ సన్నివేశాలు చరణ్ తనకు వినిపించాడని,ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా రాజమౌళి రంగస్థలం సినిమా సీక్వెల్ గురించి చెప్పేశారు.రాజమౌళి మాటలను బట్టి చూస్తే సుకుమార్ చరణ్ కాంబినేషన్లో కొత్త సినిమా కాదని రంగస్థలం సినిమాకు సీక్వెల్ చిత్రమే రాబోతుందని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సుకుమార్ పుష్ప 2 తరువాత రంగస్థలం సీక్వెల్ సినిమా పనులలో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube