ఉండి ఎమ్మెల్యే రామరాజు( MLA Ramaraju ) కంటతడి పెట్టుకోవడం జరిగింది.విషయంలోకి వెళ్తే తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నారని సమాచారం అందింది.
దీంతో మంగళవారం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడారు.
నా నియోజకవర్గ నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమయ్యింది.కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా.
వారే నా కుటుంబ సభ్యులు… వారు చెప్పినట్లు చేస్తా.రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా అని స్పష్టం చేశారు.
మరోపక్క ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరోచోట తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో.రామరాజు వర్గం ఆందోళనకు దిగింది.తమ నాయకుడు రామరాజుకి సీటు మార్చొద్దు అంటూ కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు.
మరోపక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు ( Raghu Rama Krishna Raju )పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.కొద్ది రోజుల క్రితం పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
అనంతరం కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.అయితే అది ఎమ్మెల్యేగా.? లేదా ఎంపీగా…? అనేది.త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఉండి నియోజకవర్గం నుండి రఘురామకృష్ణ రాజు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.