చెరువుల్లో అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాల వల్లనే తిరుపతి ముంపుకు గురైందని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.తిరుపతిలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
తిరుపతి నగరం చుట్టూ ఆక్రమణలు జరిగాయని దీని వల్ల తిరుపతి నగరం ముంపుకు గురవుతుందన్నారు.మొదటి అంతస్తు వరకు నీరు రావడంతో ఇంట్లోని ఫర్నిచర్ తో సహా నాశనమైయ్యాయని దీనిపై నివేదిక వచ్చిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అందరికీ నష్టపరిహారం అందిస్తామన్నారు.
ప్రధానంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఆయన అన్నారు.