పెన్సిల్ మొనపై వినాయకుడు.. ఎంత బాగున్నాడో తెలుసా?

ఇటీవల కాలంలో అతి చిన్నవాటిపై అద్భుతమైన సృష్టి చేస్తున్నారు.చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉండేలా వారు చేస్తున్నారు.

 Micro Ganesh Idol On Pencil Nib Viral,micro Ganesh Idol, Pencil Ganesh, Viral Ph-TeluguStop.com

సూక్ష్మ కళాకారులూ ప్రత్యేకమైన రోజును గుర్తించి దానికి తగ్గట్టు బొమ్మలను సృష్టించి అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.ఇంకా అలానే మొన్న స్వాతంత్య్ర దినోత్సవం నాడు బియ్యపు గింజపై జెండాను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ అయినట్టే ఇప్పుడు ఓ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే వావ్ అని అనకుండా ఉండరు.అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫోటో.ఏంటి అంటే? సాధారణంగా వినాయక చవితి వస్తే అతి పెద్ద విగ్రహాలను తెచ్చి రికార్డు సృష్టిస్తుంటారు.64 అడుగులు, 70 అడుగుల విగ్రహం రికార్డు అంటూ చేస్తుంటారు.కానీ ఇక్కడ అతి చిన్న అంటే బియ్యపు గింజలో సగం 0.04 సెంటీమీటర్ పెన్సిల్ మొనపై వినాయకుడుని చేసి వావ్ అనిపించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రాఘవ పట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ మీద బియ్యపు గింజలో సగం 0.04 సెంటీమీటర్ల ఎత్తులో వినాయకుడుని కుదించి చెక్కాడు.అది కూడా కేవలం ఒక గంట సమయంలోనే అద్భుతంగా చెక్కడం చూసి పలువురు ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube