ఇండియా నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ ఐనటువంటి ‘మారుతీ సుజుకి’( Maruti Suzuki ) గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కస్టమర్ డిమాండ్‌ను అర్థం చేసుకున్న మారుతి సుజుకి.
ఇతర కంపెనీలకు సాధ్యం కాని వాహన విక్రయాల రికార్డును నెలకొల్పింది.ఎగుమతుల విషయంలో అయితే సుజుకీ ఎవరికీ అందరాని ఎత్తుకి ఎదిగిందని చెప్పుకోవాలి.ఈ క్రమంలో 25 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది.1986-87 నుంచి కంపెనీ పలు దేశాలకు వాహనాల సరఫరా ప్రారంభించింది.తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్( Bangladesh and Nepal )కు ఈ కార్లు అడుగుపెట్టాయి.
అయితే ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు మన మారుతి కంపెనీ కార్లు ఎగుమతి కావడం విశేషం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు వీటిలో ఉన్నాయి.భారత తయారీ శక్తి సామర్థ్యాలకు ఈ మైలురాయి నిదర్శనమని కంపెనీ తాజాగా పేర్కొంది.ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ మాట్లాడుతూ….“అధిక నాణ్యత, ఉన్నతమైన సాంకేతికత, విశ్వసనీయత, పనితీరుతోపాటు అందుబాటు ధరలో లభించడంతో కంపెనీ తయారీ కార్లు విదేశీ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.
ఇకపోతే… 2023 జనవరి 9న భారత మార్కెట్‌లో మారుతి కంపెనీ మొత్తం 25 మిలియన్లు అమ్మకాలు జరిపి రికార్డు నెలకొల్పింది.డిసెంబర్ 1983లో కంపెనీ తన మొదటి కారు ‘మారుతి 800‘ని భారతదేశంలో విడుదల చేసింది.అప్పటి నుంచి మారుతి సుజుకి సంస్థ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.మారుతి సుజుకి తన భారతీయ కస్టమర్ల కోసం ఆల్టో, వ్యాగన్ఆర్ మరియు స్విఫ్ట్ వంటి ప్రసిద్ధ మోడళ్లను విడుదల చేసింది.
ఈ కార్లు దాదాపుగా 30 సంవత్సరాలుగా అమ్ముడవుతున్నాయి.మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో 17 కార్లను కలిగి ఉంది.వీటన్నింటిని భారతదేశంలో తయారు చేసి విక్రయిస్తోంది.