హిందీ బెల్ట్ లో హాట్ టాపిక్ గా 'ఛత్రపతి' టీజర్.. దసరా వీరికి బాగా కలిసొచ్చిందిగా!

ఛత్రపతి.( Chatrapathi ) ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.

 Bellamkonda Srinivas Chatrapathi First Look Teaser Trailer, Chatrapathi First Lo-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి ( Rajamouli ) డైరెక్ట్ చేయగా.ఇందులో హీరోగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) నటించాడు.

మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

మరి అంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న విషయం విదితమే.హిందీ రీమేక్ లో కూడా మన తెలుగు హీరోనే నటిస్తుండగా తెలుగు డైరెక్టర్ నే డైరెక్ట్ చేస్తున్నాడు.

నార్త్ బెల్ట్ లోనే సెన్సేషనల్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Srinivas ) ఒకరు.ఈయనకు అక్కడ మంచి డిమాండ్ ఉంది.

తన సినిమాలతో హిందీలో వరల్డ్ రికార్డును నమోదు చేసిన బెల్లంకొండ ఇప్పుడు తన హిందీ డెబ్యూ చేస్తున్నాడు.ఛత్రపతి రీమేక్ తో హిందీలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అవుతుంది.అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి నెగిటివ్ కామెంట్స్ మాత్రమే వినిపిస్తున్నాయి.

కానీ తాజాగా మేకర్స్ చేసిన పనితో ఈ సినిమా ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.మరి మేకర్స్ ఏం చేసారంటే.ఈ రోజు న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.మరి ఈ సినిమా రిలీజ్ తో కలిపి ఛత్రపతి టీజర్ (Chatrapathi Teaser) ను ప్లే చేసారు.

ఈ క్లిప్స్ నెట్టింట వైరల్ గా మారగా ఇందులోని విజువల్స్ షాకింగ్ గా మారాయి.దీంతో ఇప్పుడు ఈ టీజర్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

దీంతో టీమ్ కు కూడా దసరా సినిమా బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube