మంచు వారసుడు మనోజ్ (Manoj)ఇటీవల భూమా మౌనికను (Bhuma Mounika)అతి కొద్దిమంది సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ మౌనిక ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
అయితే ఇదివరకే మౌనిక మనోజ్ ఇద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసింది.ఇక ఈ పెళ్లి వీరిద్దరికి రెండో పెళ్లి కావడం విశేషం.
ఇలా మనోజ్ ప్రణతి రెడ్డి (Pranathi Reddy)అనే అమ్మాయిని వివాహం చేసుకొని తనకు విడాకులు ఇచ్చారు.అయితే విడాకులకు గల కారణాలను ఇప్పటివరకు ఎక్కడ ప్రస్తావించలేదు.
తాజాగా మనోజ్ మౌనిక దంపతులు వెన్నెల కిషోర్(Vennel Kishore) వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన తన మొదటి భార్యకు విడాకులు(Divorce) ఇవ్వడం గురించి స్పందించారు.2017 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని అతిరథ మహారధుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే 2019వ సంవత్సరంలోని వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో మనోజ్ తన మొదటి పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు లవ్ లైఫ్ కావాలా? నా అభిరుచులకు తగ్గ సినిమాలు ఎంచుకోవాల అనే తెలియని సందిగ్ధంలో పడ్డాను ఆ సమయంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను.ఇక నేను పంచిన ప్రేమ పరస్పరం నాకు తిరిగి రాలేదు.చాలా సార్లు నేను తన (ప్రణతి) కోసం ఇష్టం లేని పనులు చేయాల్సొచ్చింది.
చాలా అసౌకర్యంగా అనిపించేది ఒకానొక సమయంలో నేను ఎక్కడ నిలబడ్డాను ఎవరి కోసం నిలబడ్డానన్న ఆలోచనలో పడ్డాను.అందుకే అప్పుడు విడాకులు ఆలోచన వచ్చి విడాకులు తీసుకున్నానని ఈ సందర్భంగా మనోజ్ తన మొదటి భార్య ప్రణతి గురించి అలాగే విడాకుల గురించి ఆ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.