'ఏజెంట్'పై అలాంటి కామెంట్స్ చేసిన మహేష్!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.అఖిల్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

 Mahesh Babu's Review About Agent Teaser , Akhil Akkineni, Mahesh Babu, Agent Mov-TeluguStop.com

మరి ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం విదితమే.

కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.

అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఆ సూచనలు అయితే లేవు.ఇక ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి ఎట్టకేలకు నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు కూడా పెరుగుతూ పోతున్నాయి.

ఈ టీజర్ మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.పాన్ ఇండియా లెవల్లో ఈ టీజర్ కు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

ఇలా సినీ ప్రముఖులు తమ ఫీడ్ బ్యాక్ అందిస్తుండడంతో సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

మహేష్ బాబు ఎప్పుడు కూడా కొత్త టాలెంట్ ను ఆదరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు.మరి ఈసారి యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ సినిమా టీజర్ పై కూడా స్పందించాడు.టీజర్ స్టన్నింగ్ గా ఉందని విజువల్స్, థీమ్ అంతా కూడా సూపర్ గా ఉందని.టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన బెస్ట్ విషెష్ తెలిపారు.

ఈ కామెంట్స్ చూసిన అఖిల్ కూడా మహేష్ బాబు కు థాంక్యూ తెలిపాడు.

మరి ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ అవ్వబోతుండగా ఎలాంటి హాట్ అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

https://twitter.com/AkhilAkkineni8/status/1548346367676129280?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1548346367676129280%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-28963121221643649903.ampproject.net%2F2206221455000%2Fframe.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube