బిసిసిఐ చైర్మన్ కు అరుదైన గౌరవం..!

సౌరబ్ గంగూలీ.ఈ పేరు తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు.

 A Rare Honor For The Bcci Chairman , Bcci, Chairman, Rare Record, Sports Teams,-TeluguStop.com

తన ఆట శైలితో కోట్లాదిమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.ఎన్నో రికార్డులు ఆయన పేరిట ఇప్పటికీ ఉన్నాయంటే.

సౌరవ్ గంగూలీ ఆటశైలే దానికి కారణం.ప్రత్యర్థి జట్టుకు ఎన్నోసార్లు తన ఆటతోనే సమాధానం చెప్పాడు.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు.ఆయన్ని బ్రిటన్ పార్లమెంట్ సన్నానించింది.

ఈ విషయాన్ని దాదానే స్వయంగానే వెల్లడించారు.బ్రిటిన్ పార్లమెంట్ తనను సత్కారించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఓ భారతీయుడిగా తానూ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.ప్రతేడాది బ్రిటన్ ఇలా ఒకరిని సన్మానిస్తుందని, ఈ ఏడాది అలాంటి గొప్ప అవకాశం తనకు వచ్చిందన్నారు.

నాట్ వెస్ట్ కప్ ఫైనల్ మ్యాచ్ 2002 జూలై 13న జరిగింది.ఈ మ్యాచ్ టీమ్ ఇండియా క్రికెట్ అభిమానులకు ఎప్పటికి గుర్తు ఉంటుంది.ఇంగ్లాడ్ జట్టు 326 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.లక్ష్య చేధనలో గంగూలీ సేన అధ్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి గాలిలో తిప్పుతూ తన సంతోషాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

ఆ దృశ్యాలు అప్పుడు, ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి.అభిమానుల హృదయంలో ఈ ఇన్సింగ్స్ ఇప్పటికి చిరస్థాయిగా ఉందంటే ఆ రోజు మ్యాచ్ ఎలా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అప్పట్లో గంగూలీ పేరు ప్రపంచమంతా మార్మోగింది.ఎది ఏమైనా ఓ భారతీయుడు బ్రిటన్ దేశంలో ఈ విధంగా గౌరవం దక్కించుకోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకునే అంశంగా పరిగణించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube