లైకా పెట్టిన కేసులో శంకర్ కి అనుకూలంగా కోర్టు తీర్పు... చరణ్ మూవీకి లైన్ క్లియర్

స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

 Line Cleared For Charan-shankar Film, Tollywood, Pan India Movie, Lyca Productio-TeluguStop.com

అయితే ఇంతలో గతంలో స్టార్ట్ చేసి సగంలో వదిలేసిన భారతీయుడు 2 నిర్మాతలు శంకర్ పై కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.తమ నిర్మాణంలో ఇండియన్ 2 సినిమా చేయడానికి దర్శకుడు శంకర్ఒప్పందం చేసుకున్నారని, దానికోసం అతనికి రెమ్యునరేషన్ క్రింద అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిందని, అలాగే సినిమా కోసం ఇప్పటి వరకు 180 కోట్ల వరకు ఖర్చు పెట్టామని అయితే తమ సినిమా పూర్తి చేయకుండా ఇప్పుడు వేరొక సినిమా చేయడానికి అవకాశం లేకుండా స్టే ఇవ్వాలని కేసులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను కోర్టు ఇవాళ విచారించింది.ఈ సందర్భంగా లైకా తరపు న్యాయవాది కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న న్యాయస్థానం శంకర్ భవిష్యత్ ప్రాజెక్టుపై మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించారు.అయితే.

శంకర్ ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

అయితే ఈ కేసులో ఏప్రిల్ 15న దర్శకుడు శంకర్ తన వివరణ తెలియజేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే గతంలో శంకర్ ముందుకొచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని లైకా నిర్మాతలకి ఓపెన్ లెటర్ రాశారు.

అయితే అప్పట్లో వారు శంకర్ లేఖపై స్పందించలేదు.ఈ నేపధ్యంలో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకి ఎలాంటి అద్దంకి లేకుండా భవిష్యత్తులో అయినా భారతీయుడు సీక్వెల్ పూర్తి చేయాల్సిన బాద్యత అతనిపై ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube