ఏప్రిల్ 9 నుండి ఐపిఎల్ 14వ సీజన్ మొదలవనుంది.కేవలం సీజన్ మొదలవడానికి ఆరు రోజులు మాత్రమే ఉండగా ఇలాంటి టైం లో ముంబై వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడం షాక్ ఇచ్చింది.
స్టేడియంలో పనిచేస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.వారందరికి ఐసోలేషన్ లో ఉంచారు.
అయితే షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది.ఇప్పుడు ఆ మ్యాచ్ ను జరిపించాలా లేదా క్యాన్సిల్ చేయాలా అన్న ఆలోచనలో ఉంది బిసిసిఐ.
కరోనా తీవ్రత మళ్లీ ఉదృతంగా అవుతున్న కారణంగా ఈ సీజన్ ఐపిఎల్ ను కేవలం 6 వేదికల్లోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.
చెన్నై, ముంబై, కోలకత్తా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్ షెడ్యూల్స్ ఏర్పాటు చేశారు.
ఈ సీజన్ లో ఎనిమిది ప్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆరు వేదికల్లోనే ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి.అయితే వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా రావడంతో ఇప్పుడు అక్కడ కూడా మ్యాచ్ లు జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
అయితే దీనిపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.