యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో లారెన్స్( Lawrence ) ఒకరు.హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాలలో ఎక్కువ నటించిన లారెన్స్ ఆ సినిమాలతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) సినిమాలో లారెన్స్ నటించగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
లారెన్స్ సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులకు ఎంతగానో దగ్గరయ్యారు.
అయితే లారెన్స్ కుటుంబం గురించి అభిమానులకు పెద్దగా తెలియదు.లారెన్స్ కూతురి( Lawrence Daughter ) లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
లారెన్స్ కూతురు కుందనపు బొమ్మలా ఉందంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లారెన్స్ భార్య పేరు లత( Latha ) కాగా లత కూడా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సేవా కార్యక్రమాలు చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.పెళ్లి తర్వాతే లతకు కెరీర్ పరంగా కలిసొచ్చిందని లారెన్స్ భావిస్తారు.లారెన్స్ కు ఒక కూతురు ఉండగా ఆ కూతురు పేరు రాఘవి( Raghavi ) కావడం గమనార్హం.
రాఘవి ఫోటోలలో క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాఘవి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.లారెన్స్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ ఏడాది ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుందని చదువు పూర్తైన తర్వాత రాఘవి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారని సమాచారం.
ఫోటోలను చూసిన నెటిజన్లు లారెన్స్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అని కామెంట్లు చేస్తున్నారు.లారెన్స్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.