సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) .వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక సినిమా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.
తన కొడుకులను కూడా హీరోలుగా చేసి వారి స్టార్ డం కూడా తన కళ్లారా చూసుకున్నాడు.అయితే కృష్ణ కొడుకుల్లో రమేష్ బాబు( Ramesh Babu ) సంగతి పక్కన పెడితే మహేష్ బాబు మాత్రం తండ్రి కన్నా కూడా గొప్పగా ప్రస్తుతం బతుకుతున్నాడు.
అందుకు గల కారణం కృష్ణ అని ఒప్పుకోవాల్సిందే.ఎందుకంటే మహేష్ పెరిగిన విధానం, కృష్ణ బ్రతికినంత కాలం తన జీవించిన జీవితం, తను పాటించిన విలువలు అలాగే అనుసరించిన పద్ధతులు అన్నీ కూడా అచ్చుగుద్దినట్టు మహేష్ బాబుకి ( Mahesh Babu )వచ్చాయి.
తండ్రి వారసత్వంగా సినిమా మాత్రమే కాదు గుణ గణాలను కూడా పంచుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు.చాలామంది కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవిని మోసం చేసి విజయ నిర్మలను వివాహం చేసుకున్నారు అని అనుకుంటారు.
కానీ కృష్ణ జీవితంలో ఇందిర స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు.అలాగే విజయనిర్మల స్థానాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టలేరు.

ఇందిరా దేవిని( Indira Devi ) పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చాడు కానీ విజయ నిర్మలను పెళ్లి చేసుకొని ఇందిరను మోసం చేయలేదు.విజయ నిర్మలతో ( Vijay Nirmala )కృష్ణ పెళ్లి జరిగాక కూడా ఇందిరా కృష్ణ కలిసి పిల్లల్ని కని సంసార జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లారు.కృష్ణకు ఒక తోడు కావాలనుకున్నాడు అది మంచి చెడులలో దారి చూపించే నీడ కావాలనుకున్నాడు.అందుకే తన జీవితంలోకి విజయ నిర్మలను ఆహ్వానించాడు.అందువల్ల ఎవరికీ నష్టం కలగకుండా చూసుకున్నాడు.పైగా తన జీవితంలో ఇందిర తర్వాత విజయ నిర్మలకు మాత్రమే స్థానం ఉంది.
తను హీరో కాబట్టి, తనకు అందం ఉంది కాబట్టి 10 మంది అమ్మాయిలు తన చుట్టూ తిరుగుతారు కాబట్టి ఏ రోజు ఒక్క తప్పు కూడా చేయలేదు కృష్ణ.అవకాశం ఉన్నా కూడా తన పరిధి దాటి ప్రవర్తించలేరు, అందుకొక ఉదాహరణ చెబుతాను వాణిశ్రీ తో దాదాపు డజన్ కి పైగా సినిమాల్లో హీరోగా కృష్ణ నటించిన ఒక్కసారి కూడా ఆమెతో గుడ్ మార్నింగ్ అనే మాట కూడా చెప్పలేదట.

ఆయన కావాలనుకుంటే హీరోయిన్స్ ఎవరైనా తనకు పడిపోతారు.కానీ ఎంత పెద్ద హీరోయిన్ అయినా అవసరం లేకుండా ఆయన మాట్లాడలేదు.పైగా ఇదే లక్షణాలన్నీ కూడా మహేష్ బాబుకి వచ్చాయి.ఆయన జీవితంలో నమ్రతకు తప్ప మరొకరికి స్థానం లేదు.ఇప్పటి కాలంలో హీరోలు విచ్చలవిడిగా జీవితాన్ని గడుపుతున్న మహేష్ బాబు మాత్రం చాలా పద్ధతిగా బ్రతుకుతున్నాడు.తన భార్య, పిల్లలు తప్ప మరొక విషయం ఆలోచించడు.
సినిమా లేదా కుటుంబం ఈ రెండు మాత్రమే అతడు జీవితంలో ఉన్నాయి.ఈ విషయంలో కృష్ణకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మహేష్ బాబు కూడా అచ్చుగుద్దునట్టు అలాగే ప్రవర్తిస్తున్నాడు.
వీరికి భార్య తప్ప మరొక లోకం ఉండదు.కుటుంబం తప్ప మరొక ప్రపంచం తెలియదు.