బౌండరీ లైన్ దగ్గర ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన కింగ్ కోహ్లీ..

టీంమిండియా టి20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉంది.కానీ ఇవాళ ఆస్ట్రేలియా తో వార్మప్‌ మ్యాచ్ ఆడింది టీం మిండియా.

 King Kohli Who Flew Into The Air With One Hand Near The Boundary Line And Caught-TeluguStop.com

ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి టీమ్ ఇండియా కు విజయం అందించాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఒంటి చేతితో క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడమే కాకుండా, టీమ్ డేవిడ్ ను రన్ అవుట్ చేసి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆస్ట్రేలియా లక్ష చేదనలో చివరి ఓవర్లో ఆస్ట్రేలియాకు 11 పరుగులు అవసరం కాగ ఆ సమయంలో బౌలింగ్ చేయడానికి షమీ వచ్చాడు.

మొదటి రెండు బంతులకు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.

ఇక మూడవ బంతికి ప్యాట్‌ కమ్మిన్స్‌ భారీ షాట్‌ కొట్టాడు.లాంగాన్‌ మీదుగా గాలిలో సిక్సర్ గా వెళ్తున్న బంతిని బౌండరీ వద్ద కోహ్లీ అద్భుతమైన రీతిలో ఒంటి చేత్తో అందుకొని ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురి చేశాడు.పైకి ఎగిరిన కోహ్లీ కుడి చేతి తో ఆ క్యాచ్‌ పట్టాడు.

సరైన టైమింగ్‌తో జంప్‌ చేసిన కోహ్లీ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ పట్టుకున్నాడు.డగ్‌ ఔట్‌ దగ్గర ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూర్చుని ఉన్న సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టుకున్న దృశ్యాన్ని చూసిన ఆసీస్ ప్లేయర్లు చప్పట్లతో కోహ్లీని అభినందించారు.

చివరి ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ నాలుగు వికెట్లను తీసి ఆస్ట్రేలియాను ఓడించాడు.కింగ్ కోహ్లీ పట్టిన ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/Clarkeyy23/status/1581910259836235776?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1581910259836235776%7Ctwgr%5E81c55d3219e4a8bec78188ba0b59983acbb2e492%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube