నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉండని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహన్ అన్నారు.రెండు రోజుల పాటు విశాఖలో ఉండి పవన్ కల్యాణ్ విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే.

 Nadendla Manohar Hot Comments-TeluguStop.com

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాదెండ్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడిలో జన సైనికులు చెత్త బుట్టలపై ఉన్న మూతలు, చీపుర్లను మారణాయుధాలుగా వినియోగించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారన్న నాదెండ్ల…ఇంత కంటే హాస్యాస్పదమైన విషయం ఉంటుందా? అని ఎద్దేవా చేశారు.ఈ కారణం చూపి వంద మందికి పైగా జన సైనికులను పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టడానికి గంట ముందుగా వైసీపీ నేతలపై దాడి జరిగితే… పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోనే 500 మంది జనసేన కార్యకర్తలు దాడిలో పాలుపంచుకున్నారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని అన్నారు.

ఈ అంశాన్ని నోటీసుల్లో నుంచి తొలగించే దిశగా పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చామని ఆయన చెప్పారు.విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పిన పోలీసులు.

తమను జనవాణి నిర్వహించేందుకు వీలు లేదని ఆంక్షలు విధించారని అన్నారు.నగరంలో 30 యాక్టు అమలులో ఉంటే వైసీపీ నేతలు విశాఖ గర్జనను ఎలా నిర్వహించారని ప్రశ్నించారు.

పవన్ మరో రెండు రోజుల పాటు మంగళగిరిలోనే ఉంటారని, పోలీసులు పెట్టిన కేసుల్లో నుంచి పార్టీ కార్యకర్తలకు విముక్తి కల్పించాకే తిరిగి వెళతారని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube