నిజాం పాలనకి పూర్వం నుండే తెలంగాణ లోని ప్రతి నగరానికి, గ్రామానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది.మన దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం దేశంలోని రాజధానుల పేర్లతో పాటు చారిత్రాత్మక ప్రాంతాల పేర్లని కూడా మార్చలన్న డిమాండ్ వచ్చింది.
మన హైదరాబాద్ పేరు కూడా భాగ్యనగరంగా మార్చలన్న అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రజల కోరిక ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాలేకపోయింది.టీఆరెస్ పేరును ఇటీవల బీఆరెస్ గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లోని జిల్లాల, నగరాల పేర్లను మాత్రం మార్చలేక పోతున్నాడు.
చరిత్ర, సాంస్కృతిక ఉద్యమం తోనే తెలంగాణ సాకారం అయ్యిందన్న విషయాన్ని నేడు ముఖ్యమంత్రి మర్చిపోవడం శోచనీయం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ లోని నగరాల పేర్లని ఆయా నగరాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా మార్చాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ స్వార్ధ రాజకీయాల కారణంగా అవి రూపం దాల్చలేకపోయాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోయాడు.ఇటీవల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, స్వాతంత్ర్య వజ్రోత్సవాల్ని అధికారికంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం నిజాం పాలన నాటి నగరాల పేర్లని కూడా మార్చడంపై ఆలోచిస్తే బాగుంటుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను భాగ్యనగరంగా, కరీంనగర్ ను ఎనగందులగా, నిజామాబాద్ ను ఇందూరు గా, ఆదిలాబాద్ ను ఎదులాపురంగా, మహబూబ్ నగర్ ను పాలమూరుగా మారుస్తూ పాత చరిత్రాత్మక పేర్లనే కొత్త పేర్లుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.అలాగే రాష్ట్రంలోని అనేక తాలూకా, మండల కేంద్రాలకు కొనసాగుతున్న నిజాం పాలన నాటి పాత పేర్లని తొలగించి, ఆయా ప్రాంతాల మెజారిటీ ప్రజల ఇష్ట ప్రకారం కొత్త పేర్లని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.